MLA Rajaiah Kadiyam : కడియం అవినీతి తిమింగలం
ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య
MLA Rajaiah Kadiyam : స్టేషన్ ఘన్ పూర్ లో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, ఎమ్మెల్సీ , మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. గత కొంత కాలం నుంచి రాజయ్య సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. మరోసారి కడియంపై రెచ్చి పోయారు. నిప్పులు చెరిగారు. కడియం శ్రీహరి మామూలోడు కాదని అవినీతి తిమింగలం అంటూ మండిపడ్డారు రాజయ్య. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో గులాబీ పార్టీలో ఆరోపణల పర్వం తారా స్థాయికి చేరింది.
ఎమ్మెల్యేగా కాక ముందు కడియం శ్రీహరి ఇంట్లో గచ్చు నేల, కిటికీలకు గోనె సంచులు ఉండేవని ..కానీ ప్రస్తుతం ఆయన ఇంట్లో డబ్బుల సంచులు మూలుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంత పెద్ద స్థాయిలో నోట్ల కట్టలు ఎక్కడివంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే రాజయ్య(T Rajaiah).
కడియం శ్రీహరి అవినీతి మీద ఖల్ నాయక్ పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తానంటూ ప్రకటించారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో స్టేషన్ ఘన్ పూర్ లో 13 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చానని, ఇందుకు తాను గర్వ పడుతున్నానని అన్నారు రాజయ్య.
Also Read : Jitender Reddy Eatala : ఈటలపై జితేందర్ రెడ్డి కామెంట్స్
