Kailash Vijayvargiya : నితీశ్ ఎప్పుడు వదిలేస్తాడో చెప్పలేం
బాయ్ ఫ్రెండ్ ను మార్చేసినంత ఈజీగా
Kailash Vijayvargiya : బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై సంచలన కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ వర్గియా(Kailash Vijayvargiya). శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విదేశాల్లో బాయ్ ఫ్రెండ్ లను అమ్మాయిలు త్వరగా మార్చేస్తారన్న అపవాదు ఉంది. ఇది సరిగ్గా బీహార్ సీఎంకు సరి పోతుందన్నారు. నితీశ్ కుమార్ ఎప్పుడు ఎవరి చేయి పట్టుకుంటారో ఎవరిని ఎప్పుడు వదిలేస్తాడో చెప్పలేమన్నారు.
ఇటీవల 17 ఏళ్ల పాటు బీహార్ లో జేడీయూ, భారతీయ జనతా పార్టీ మధ్య బంధం కొనసాగింది. కానీ ఉన్నట్టుండి సుదీర్ఘ అనుబంధానికి చెక్ పెట్టారు నితీశ్ కుమార్. ఉన్నట్టుండి బీజేపీకి షాక్ ఇచ్చారు.
ఆపై మిత్ర ధర్మాన్ని తోసి రాజన్నారు. ఇక జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మహా ఘట్ బంధన్ ఏర్పాటు చేశారు. 31 మందితో కొత్త కేబినెట్ ను విస్తరించారు.
డిప్యూటీ సీఎంగా లాలూ తనయుడు తేజస్వి యాదవ్ కు చోటు కల్పించారు. మరో కొడుకు తేజ ప్రతాప్ యాదవ్ కు కేబినెట్ లో బెర్త్ దక్కింది. ఇది పక్కన పెడితే బీజేపీని అనూహ్యంగా ఒంటరిని చేశాడు నితీశ్ కుమార్.
ఆ పార్టీకి రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జన శక్తి పార్టీ మాత్రమే ఉంది. ఆ పార్టీని నిట్ట నిలువునా చీల్చాడు. ప్రస్తుతం కైలాష్ విజయ్ వర్గియా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేడు నితీశ్ కుమార్.
Also Read : నితీశ్ కుమార్ జన్మలో ప్రధాని కాలేరు
"When I was travelling abroad, someone there said that women there change their boyfriends at any time. Bihar CM is also similar, never know who's hand he may hold or leave…," says Kailash Vijayvargiya, BJP National General Secretary in Indore, MP pic.twitter.com/zKVAbg0e30
— ANI (@ANI) August 18, 2022