Kaleshwaram Case : కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టులో దావా
కేసీఆర్, హరీశ్ రావును పై ఫైర్
Kaleshwaram Case : భూపాలపల్లి – రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇదే ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురైంది.
Kaleshwaram Case for Project Issues
పిల్లర్స్ పూర్తిగా వంగి పోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సమాధానం రాలేదు. నిన్నటి దాకా కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు అహో అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది బీఆర్ఎస్ సర్కార్.
ఉన్నట్టుండి ఎన్నికల వేళ తుస్సుమంది . కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించింది. ఈ ప్రాజెక్టు వల్ల నష్టం తప్ప లాభం లేదని పేర్కొంది. నాణ్యతా లోపం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు లోనైందని స్పష్టం చేసింది.
దీంతో కాళేశ్ంరం(Kaleshwaram) ప్రాజెక్టులో కుంగుబాటుపై భూపాలపల్లి కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. సీఎం
కసీఆర్ , మంత్రి హరీష్ రావు పై కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ , ఓఎస్డీ స్మితా సబర్వాల్ , జల వనరుల శాఖ ఇంజనీర్ హరిరామ్, శ్రీధర్ , మేఘా కంపెనీ కృష్ణా రెడ్డి, ఎల్ అండ్ టి కంపెనీపై కేసు నమోదు చేయాలని కోరారు పిటిషనర్.
Also Read : AP CM YS Jagan : పల్నాడుకు కృష్ణమ్మ జలాలు