Kalva Sujatha : కాంగ్రెస్ నేత కాల్వ సుజాత కంటతడి
తనకు కాకుండా ఇంకొకరి ఎలా ఇస్తారని
Kalva Sujatha : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ కలకలం రేపుతోంది. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ లీడర్ కొత్త మహేందర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రూ. 10 కోట్లు తీసుకున్నాడని, టికెట్ల బేరం పెట్టాడంటూ ఆరోపించారు. ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు.
Kalva Sujatha Comment
ఈ తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత(Kalva Sujatha) కన్నీటి పర్యంతం అయ్యారు. తాండూరు టికెట్ తనకే ఇవ్వాలని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తాండురు నియోజకవర్గంలో గత కొన్నేళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తూ వచ్చానని , తీరా చూస్తే బుయ్యాని మనోహర్ రెడ్డికి తాండూరు కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తారంటూ వాపోయారు .
ఆమె పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. అధికార పార్టీపై నిత్యం పోరాటం చేస్తూ వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించారు. ప్రజా నాయకురాలిగా పేరు పొందారు. చివరకు తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
అసలు పార్టీలో ఏం జరుగుతుందో తనకే కాదు ఇతరులకు కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : JP Nadda : రామోజీతో జేపీ నడ్డా ములాఖత్
