Kamala Harris : ఉక్రెయిన్ కు అమెరికా ఖుష్ క‌బ‌ర్

భారీ సాయం ప్ర‌క‌టించిన హారీస్

Kamala Harris : సైనిక చ‌ర్య పేరుతో యుద్ద‌కాండ సాగిస్తున్న ర‌ష్యాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది అమెరికా. ఓ వైపు ఆర్థిక ఆంక్ష‌ల‌ను ప్ర‌క‌టిస్తూనే ఉంది. దానికి వెన్ను ద‌న్నుగా మ‌రికొన్ని దేశాలు సైతం అనుస‌రిస్తున్నాయి.

అయితే ఇదే స‌మ‌యంలో ర‌ష్యా తీవ్రంగా వ్య‌తిరేకించింది. త‌మ‌పై ఆర్థిక ఆంక్ష‌లు విధించ‌డం అంటే త‌మ‌పై ప‌రోక్షంగా యుద్దం ప్ర‌క‌టించ‌డ‌మేనంటూ స్ప‌ష్టం చేశారు పుతిన్.

ఈ త‌రుణంలో అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ర‌ష్యా చేతిలో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ఉక్రెయిన్ కు తాము స‌హాయం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ దేశం త‌ర‌పున ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ వెల్ల‌డించింది.

త‌మ‌తో పాటు ఇత‌ర దేశాలు సైతం మాన‌వ‌తా దృక్ఫథంతో ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా రొమేనియా, బెల్జియం, కెన‌డా, ఫ్రాన్స్ , జ‌ర్మ‌నీ, గ్రీస్ , పోర్చుగ‌ల్, స్పెయిన్ , స్వీడ‌న్ , నెద‌ర్లాండ్ , యూకే, ఇజ్రాయెల్ త‌దిత‌ర దేశాల‌న్నీ సాయం ప్ర‌క‌టించాయి.

ర‌ష్యా సైనిక‌, మిస్సైల్స్ దాడుల నేప‌థ్యంలో ఉక్రెయిన్ భారీగా న‌ష్ట పోయింద‌న్నారు క‌మ‌లా హారీస్(Kamala Harris ). తీవ్రంగా దెబ్బ తిన్న ఆ దేశానికి ఐక్య రాజ్య స‌మితి ఆహార కార్య‌క్ర‌మం ద్వారా 50 మిలియ‌న్ డాల‌ర్ల‌ను మాన‌వ‌తా దృక్ఫ‌థంతో తాము సహాయం అంద‌జేస్తున్న‌ట్లు ఇవాళ ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ త‌ల వంచేంత దాకా తాము యుద్దాన్ని విర‌మించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు ర‌ష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్.

బేష‌ర‌తుగా ఒప్పుకోక పోతే తీవ్ర ప‌రిణ‌మాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇక‌నైనా మారాల‌ని ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీకి సూచించారు.

Also Read : ఆయిల్ దిగుమ‌తులపై ఆంక్ష‌లు

Leave A Reply

Your Email Id will not be published!