Kamareddy Farmers : తగ్గేదే లేదంటున్న రైతన్నలు
కీలక జేఏసీ సమావేశం
Kamareddy Farmers : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు(Kamareddy Farmers) వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులు తగ్గడం లేదు.
ఇది నామమాత్రపు ముసాయిదా మాత్రమేనని, ఇదే ఫైనల్ కాదంటూ కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ రైతులు మాత్రం ఇదంతా ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని , తాము మాత్రం పొలాలను ఇచ్చే ప్రసక్తి లేదంటున్నారు. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో, కామారెడ్డి(Kamareddy Farmers) మాస్టర్ ప్లాన్ పేరుతో తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో రైతు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు, తమ న్యాయ పరమైన డిమాండ్లను సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యేకంగా తీర్మానం చేయనున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ రైతుల ఆందోళనకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. మరో వైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఈ మేరకు కేసు కూడా నమోదు చేశారు. ఇవాళ జరిగే కీలక మీటింగ్ లో ఏడు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొంటున్నారు.
అడ్లూరు ఎల్లారెడ్డి సమావేశానికి వేదిక కానుంది. అయితే మాస్టర్ ప్లాన్ లో మార్పులు ఉంటాయని, కన్సల్టెన్సీ తప్పిదం వల్లే గందరగోళానికి కారణమని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్.
Also Read : నోటిఫికేషన్ల జాతర కొలువులు ఎక్కడ