Kamareddy Tension : కామారెడ్డిలో టెన్ష‌న్ టెన్షన్

రేవంత్ రెడ్డి సోద‌రుడితో వాగ్వాదం

Kamareddy Tension : కామారెడ్డి – తెలంగాణ‌లో ప్ర‌చారం ముగిసింది. కానీ ఆయా పార్టీల మ‌ధ్య ఉద్రిక‌త‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని రెండు చోట్ల అంద‌రి క‌ళ్లు ఫోక‌స్ ఉన్నాయి. బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ బ‌రిలో నిలిచారు గ‌జ్వేల్ , కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల‌లో.

Kamareddy Tension with Security

ఇక్క‌డ కేసీఆర్ పై గ‌జ్వేల్ లో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో ఉన్నారు. ఇక కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఈసారి ఎలాగైనా స‌రే కామారెడ్డిలో జెండా ఎగుర వేయాల‌ని టీపీసీసీ చీఫ్ డిసైడ్ అయ్యారు. బుధ‌వారం ఆయ‌న సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి నివాసం వ‌ద్ద‌కు చేరుకున్నారు పోలీసులు. గ‌త 15 రోజులుగా త‌న సోద‌రుడి త‌ర‌పున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు . రేవంత్ రెడ్డిని(Revanth Reddy) గెలిపించాల‌ని కోరుతున్నారు.

చీఫ్ ఏజెంట్ గా ఉన్నారు కొండ‌ల్ రెడ్డి. ఆయ‌న‌ను టార్గెట్ గా చేస్తూ పోలీసులు రంగంలోకి దిగార‌ని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు. ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.

Also Read : JD Lakshmi Narayana Barrelakka : బర్రెల‌క్క‌కు గెలిచే ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!