Kanakadurga Temple : దుర్గమ్మ దర్శనానికి భారీ ఏర్పాట్లు
రోజుకు లక్షా 70 వేల మందికి ఛాన్స్
Kanakadurga Temple : విజయవాడ – దసరా పండుగను పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలో పేరు పొందిన , బెజవాడలో కొలువు తీరిన కనక దుర్గమ్మ ఆలయంలో(Kanakadurga Temple) ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
రోజుకు లక్షా 70 వేల మందికి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆలయ కార్య నిర్వహణ అధికారి. ప్రతి సెకనుకు ఇద్దరు లేదా ముగ్గురు భక్తులు దర్శించుకునేలా చేశామని స్పష్టం చేశారు.
Kanakadurga Temple Arrangements
రోజుకు నాలుగు గంటల పాటు పూజలు, అమ్మ వారికి నివేదనలు ఉంటాయని పేర్కొన్నారు. 24 గంటల పాటు కనకదుర్గమ్మ దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు ఈవో.
ఇదిలా ఉండగా ప్రజా ప్రతినిధులు , ఇతర ప్రోటోకాల్ ఉన్న వారు స్వయంగా వస్తేనే అనుమతి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఫోన్ ద్వారా లేదా ఇతర సిఫార్సుల ద్వారా ఎలాంటి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు ఈవో.
Also Read : Nara Lokesh : రెండో రోజు లోకేష్ విచారణ