హిజాబ్ పై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కనీజ్ ఫాతిమా ఊహించని రీతిలో తాజాగా కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె పోరాడారు. విద్యార్థినితులతో కలిసి ఆందోళన చేపట్టారు. బీజేపీ అభ్యర్థి చంద్రకాంత్ పాటిల్ పై 3 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
విద్యా సంస్థల్లోకి హిజాబ్ ధరించి వెళ్ల కూడదంటూ బొమ్మై సర్కార్ నిషేధం విధించింది. దీనిని నిరసిస్తూ కాలబురగి జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులతో కలిసి కాంగ్రెస్ నాయకురాలు కనీజ్ ఫాతిమా ఆందోళన చేపట్టారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందారు. బీజేపీ అభ్యర్థిని ఓడించి షాక్ కు గురి చేశారు. గుల్బర్గ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఇదిలా ఉండగా కర్ణాటక అసెంబ్లీలో ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టీ నుంచి 136 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో ఏకైక ముస్లిం మహిళ ఆమె ఒక్కరే కావడం విశేషం. హిజాబ్ బ్యాన్ కు వ్యతిరేకంగా , గళం విప్పిన ఏకైక మహిళా నాయకురాలు కనీజ్ ఫాతిమా.
ఇదిలా ఉండగా కనీజ్ ఫాతిమా 2018లో చంద్రకాంత్ పాటిల్ ను ఓడించారు. గెలుపొందిన అనంతరం హిజాబ్ ధరించిన తనను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. హిజాబ్ ధరించడం అన్నది వ్యక్తిగతమని దానిని కూడా బీజేపీ రాజకీయం చేయాలని అనుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు కనీజ్ ఫాతిమా.
