Kapileswara Swamy : కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం
భక్తులకు అమ్మ వారి దర్శనం
Kapileswara Swamy : తిరుపతి – భక్తుల కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం. ప్రతి ఏడాది కపిలేశ్వర స్వామి తెప్పోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు ఆలయ పాలక మండలి.
Kapileswara Swamy Utsavams
తాజాగా అంగరంగ వైభవోపేతంగా శ్రీ కపిలేశ్వర స్వామి తెప్పోత్సవాలను నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు దర్శించు కునేందుకు పోటెత్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామాక్షి అమ్మ వారు దర్శనం ఇచ్చారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ కామాక్షి, లక్ష్మీ, సరస్వతి అమ్మ వారు కపిల తీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామి వారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ(TTD) అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read : TTD Sarva Darshan Tokens : సర్వ దర్శన టోకెన్లు క్లోజ్