Karachi Restaurant : క‌రాచీ రెస్టారెంట్ లో ‘గంగూబాయి సీన్’

ప్ర‌ద‌ర్శించ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న

Karachi Restaurant : పాకిస్తాన్ లోని క‌రాచీ(Karachi Restaurant)లోని ప్ర‌ముఖ గా పేరొందిన స్వింగ్స్ రెస్టారెంట్ లో ఆలియా భ‌ట్ న‌టించిన గంగూబాయి సీన్ ప్ర‌ద‌ర్శించ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ చిత్రంలో సెక్స్ వ‌ర్క‌ర్ గా న‌టించింది ఆలియా భ‌ట్. త‌న మొద‌టి క‌స్ట‌మ‌ర్ ని ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నించే స‌న్నివేశాన్ని ప‌దే ప‌దే రెస్టారెంట్ లో ప్ర‌ద‌ర్శించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే స‌మ‌యంలో ఆలియా భ‌ట్ చిత్రంలో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు వాడిన డైలాగ్ ఆజా నా రాజా డైలాగ్ ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది.

ఈ సీన్ ను రెస్టారెంట్ లో వాడేందుకు ప్ర‌ధాన కార‌ణం అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వం. ఇదిలా ఉండ‌గా స్వింగ్స్ రెస్టారెంట్(Karachi Restaurant) గంగూబాయి సీన్ ను వాడుకోవ‌డాన్ని మ‌హిళ‌లు, అభ్యుద‌య‌వాదులు , ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

త‌న సొంత స‌మాజానికి చెందిన మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాడిన సెక్స్ వ‌ర్క‌ర్ నిజ జీవిత క‌థ ఆధారంగా గంగూబాయి సినిమాను తెర‌కెక్కించాడు. అంతే కాదు వ్య‌భిచారంలోకి నెట్టేయ‌బ‌డిన న‌టి వాస్త‌వ జీవిత క‌థ‌.

సినిమాలోని స‌న్నివేశాన్ని ఉప‌యోగించినందుకు సామాజిక మాధ్య‌మాల‌లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. స్వింగ్స్ రెస్టారెంట్ వైర‌ల్ గా మారింది. రెస్టారెంట్ ముందు రాజులంద‌రినీ పిలుస్తోంది.

ఆజావో పురుషుల‌కు ప్ర‌త్యేకం. 25 శాతం త‌గ్గింపు పొందండి అంటూ ప్ర‌చారం చేసింది. దీనిపై మ‌హిళ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒక మ‌హిళ ఎదుర్కొన్న క‌థ‌ను చిత్రంగా తీస్తే దానిని ఇలా రెస్టారెంట్ లో పెట్టి అవ‌మానిస్తారా అంటూ పాకిస్తాన్ లోనే విమ‌ర్శ‌లు ఎదుర‌య్యారు. దీంతో రెస్టారెంట్ య‌జ‌మానులు స్పందించారు. తాము కావాల‌ని ప్ర‌ద‌ర్శించ‌లేదంటూ క్ష‌మించ‌మ‌ని కోరారు.

Also Read : తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత వాగ్దేవి

Leave A Reply

Your Email Id will not be published!