Araga Jnanendra : పాపులర్ ఫ్రంట్ పై కర్ణాటక కన్నెర్ర
నిషేధం విధించే దిశగా ఆలోచన
Araga Jnanendra : దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఇప్పటికే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తూ, సానుభూతిపరులను రిక్రూట్ చేస్తూ విద్వేష పూరితంగా తయారు చేస్తోందంటూ ఆరోపించింది కేంద్రం.
ఇందులో భాగంగా మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే దిశగా కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తో పాటు ఈడీ రంగంలోకి దిగింది. దేశంలోని 11 రాష్ట్రాలలో సోదాలు చేపట్టింది.
అంతే కాకుండా మొత్తం 106 మందికి పైగా పీఎఫ్ఐకి చెందిన నాయకులు, బాధ్యులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ కీలక సమావేశం చేపట్టింది.
ఈ సమావేశానికి కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, జాతీయీ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.
ఇదిలా ఉండగా తమ వారిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శుక్రవారం 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది కేరళ రాష్ట్రంలో. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
బస్సులపై రాళ్లు రువ్వారు. ఇదిలా ఉండగా 22 మంది పీఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది.
ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం ఆమోద యోగ్యం కాదని పేర్కొంది. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
ఈ మేరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని నిషేధించే ప్రక్రియ ప్రారంభమైందని ఆ రాష్ట్ర హొం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర(Araga Jnanendra) ప్రకటించారు. రాష్ట్ర పోలీసులు 18 చోట్ల సోదాలు చేపట్టారని 15 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
Also Read : కేరళలో పీఎఫ్ఐ బంద్ ఉద్రిక్తం