Priyanka Gandhi : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అవినీతికి అంద‌లం

కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : కన్న‌డ నాట రాజ‌కీయం మరింత వేడెక్కింది. అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నాయి. మాట‌ల తూటాలు పేలుస్తున్నాయి. ఈసారి ఎలాగైనా స‌రే క‌ర్ణాట‌క‌లో ప‌వ‌ర్ లోకి రావాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేస్తోంది.

కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ సార‌థ్యంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. కీల‌క నేత‌లంతా ఫుల్ ఫోక‌స్ పెట్టారు క‌ర్ణాట‌క‌పై. ఇందులో భాగంగా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీతో పాటు ర‌ణ్ దీప్ సూర్జేవాలా రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా ఉన్నారు. అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

తాజాగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్రియాంక గాంధీ ప్ర‌సంగించారు.  క‌ర్ణాట‌క బీజేపీ ప్ర‌భుత్వం క‌మీష‌న్ స‌ర్కార్ గా పేరు పొందింద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు ఇలాంటి స‌ర్కార్ ను కావాల‌ని అనుకోర‌ని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపారు. మార్పు త‌ధ్య‌మ‌ని, ప్ర‌జా పాల‌న‌ను అందించే స‌త్తా త‌మ పార్టీకి మాత్ర‌మే ఉంద‌న్నారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).

దేశంలో, రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అప్ప‌నంగా బ‌డా బాబుల‌కు క‌ట్ట‌బెడుతున్న ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు. ఇంకా ఏం మిగిలి ఉంద‌ని క‌ర్ణాట‌క‌లో కొలువు తీరారంటూ ప్ర‌శ్నించారు ప్రియాంక గాంధీ.

Also Read : రాహుల్ అభ్య‌ర్థ‌న కోర్టు తిర‌స్క‌ర‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!