CM Bommai : దేశ ప్ర‌జ‌ల చిర‌కాల డిమాండ్ తీరింది – సీఎం

పీఎఫ్ఐ నిషేధంపై బ‌స్వ‌రాజ్ బొమ్మై కామెంట్స్

CM Bommai :  దేశ వ్యాప్తంగా విస్త‌రించిన పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం జూలు విదిల్చింది. ఐదేళ్ల పాటు పీఎఫ్ఐతో పాటు అనుబంధ సంస్థ‌లపై నిషేధం విధించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 400 మందికి పైగా పీఎఫ్ఐ నేత‌లు, కార్య‌క‌ర్త‌లను అదుపులోకి తీసుకుంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌తో పాటు క‌ర్ణాట‌క‌లోని కోస్తా జిల్లాల్లో పీఎఫ్ఐ బ‌ల‌మైన ఉనికిని క‌లిగి ఉంది. పీఎఫ్ఐ స‌పోర్ట్ గా ఉన్న రాజకీయ పార్టీ సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సీట్లు గెలుపొందింది.

ఇదిలా ఉండ‌గా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థ‌లపై నిషేధం విధించ‌డంపై స్పందించారు క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై(CM Bommai) . రాష్ట్ర బీజేపీ కూడా కేంద్రం నిర్ణ‌యాన్ని స్వాగ‌తించింది. సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు గ‌త కొంత కాలం నుంచీ పీఎఫ్ఐని , దాని అనుబంధ సంస్థ‌ల‌ను నిషేధించాల‌ని కోరుతూ వ‌స్తున్నార‌ని చివ‌ర‌కు ఈ నిర్ణ‌యం వెలువ‌డింద‌న్నారు సీఎం. పీఎఫ్ఐకి చెందిన సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా, కేఎఫ్‌డి – క‌ర్ణాట‌క ఫోర‌మ్ ఫ‌ర్ డిగ్నిటీ త‌దిత‌ర సంస్థ‌ల‌ను రాష్ట్రంలో నిషేధానికి గురైన‌ట్లు చెప్పారు.

క‌ర్ణాట‌క సీఎం బొమ్మై(CM Bommai)  బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. పీఎఫ్ఐకి చెందిన వారంతా దేశ వ్యతిరేక కార్య‌క‌లాపాల‌లో పాలు పంచుకున్నారు. అనేక హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు.

క‌రాటే పేరుతో ఉగ్ర‌వాదులుగా శిక్ష‌ణ పొందార‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అద్భుత నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌శంసించారు.

Also Read : విప్ల‌వ యోధుడికి విన‌మ్ర నివాళి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!