Rahul Gandhi : క‌ర్ణాట‌క సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి – రాహుల్

ప్ర‌ధాని ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచల‌న కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. దేశ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.

క‌ర్ణాట‌క‌లో భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. పోలీసు రిక్రూట్ మెంట్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేగింది.

ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుత సీఎంగా ఉన్న బస‌వ‌రాజ్ బొమ్మై గ‌తంలో హోం శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు మిన్నంటాయి.

దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌డంతో ఏకంగా ఐపీఎస్ ఆఫీస‌ర్ ను అరెస్ట్ చేశారు. దీనినే ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు రాహుల్ గాంధీ. ఉద్యోగాల‌ను గంప గుత్త‌గా అమ్మ‌కానికి పెట్ట‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు.

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని వేలాది మంది యువ‌తీ యువ‌కుల క‌ల‌ల‌ను నాశ‌నం చేశారంటూ సీరియ‌స్ అయ్యారు. పోలీస్ రిక్రూట్ మెంట్ స్కాంలో అస‌లైన నిందితులు ఇంకా ఉన్నార‌ని వారిని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

ఇదే స‌మ‌యంలో గ‌తంలో హోం మంత్రిగా ఉంటూ ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న బస‌వ‌రాజ్ బొమ్మైని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఇంత జ‌రిగినా ప్ర‌ధాన మంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్ర‌శ్నించారు. వ్యాపారుల‌కు, ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి దాచుకున్న బ్యాంకుల్లోంచి డ‌బ్బుల్ని కొల్ల‌గొట్ట‌డం బీజేపీ పాల‌న‌లో ప‌రిపాటిగా మారింద‌న్నారు.

న్యాయ‌మైన విచార‌ణ జ‌ర‌గాలంటే ఇప్పుడు ఉన్న బొమ్మైని తొల‌గిస్తేనే స‌రైన న్యాయం జ‌రుగుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ.

Also Read : బెలూన్ల క‌ల‌క‌లంపై హోం శాఖ‌కు ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!