Karnataka Drops : విరాళాల సేకరణ ఉత్తర్వులు రద్దు
వివాదాస్పద నిర్ణయం వెనక్కి
Karnataka Drops : బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వానికి ఈ ఏడాది కలిసి రానట్టుంది. ఇప్పటికే కమీషన్, కరప్షన్ సస్టేట్ గా మార్చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది కాంగ్రెస్ పార్టీ. వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదం సర్కార్ ను వెంటాడుతోంది. మరో వైపు ఐటీ సెక్టార్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఈ తరుణంలో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్రభుత్వం. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు విరాళాలు ఇవ్వాలంటూ అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది పేరెంట్స్ నుంచి ప్రభుత్వ ఆధీనంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల అభివృద్ది పనుల కోసం ప్రతి విద్యార్థి పేరెంట్స్ నెల వారీగా విరాళంగా రూ. 100 చొప్పున ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. వెంటనే ఉపసంహరించు కోవాలని లేక పోతే ఆందోళన చేపడతామని పేరెంట్స్ హెచ్చరించారు. దీంతో కర్ణాటక సర్కార్ దిగిరాక తప్పలేదు(Karnataka Drops). కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం కుమార స్వామి ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని విరమించు కోవాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో ఒత్తిళ్లకు తల వంచింది కర్ణాటక సర్కార్ . ఈ మేరకు ఆదివారం జారీ చేసిన ఉత్తర్వులను ఉప సంహరించు కుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభుత్వం దివాళా తీసింది. అందుకే సిగ్గు లేకుండా డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జేడీఎస్ చీఫ్.
Also Read : మంత్రి సోమన్నపై సీఎం సీరియస్