Rahul Gandhi Karnataka Govt : అవినీతికి కేరాఫ్ కర్ణాటక సర్కార్
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
Rahul Gandhi Karnataka Govt : ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం కర్ణాటకలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బెలగావిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
కర్ణాటకలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ దేశంలోనే అవినీతిలో టాప్ లో నెలకొందన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఏదైనా జరగాలంటే 40 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన హామీలు కూడా ఇచ్చారు.
కర్ణాటకలో తమకు అధికారం అప్పగిస్తే మెరుగైన పాలన అందజేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Karnataka Govt). 2 సంవత్సరాల పాటు నిరుద్యోగ గ్రాడ్యూయేట్లకు ప్రతి నెలా రూ. 3,000 ఇస్తామన్నారు. అంతే కాకుండా 2 సంవత్సరాల పాటు డిప్లొమా హోల్డర్లందరికీ నెలకు రూ. 1,500 ఇస్తామని ప్రకటించారు.
10 లక్షల మంది యువతకు ఉపాధి హామీ ఇస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఏడాదిన్నర లోపు ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ సర్కార్ , కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండూ ఒక్కటేనన్నారు రాహుల్ గాంధీ.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు. రాహుల్ సభకు భారీ ఎత్తున తరలి వచ్చారు జనం.
Also Read : పార్లమెంట్ లో గందరగోళం