Priyanka Gandhi : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అవినీతిమ‌యం

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత ప్రియాంక

క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. వ‌చ్చే మేనెల 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌ధానంగా ఈసారి పోటీ అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య జ‌రుగుతోంది. ఇరు పార్టీలు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నాయి. తాజాగా మంగ‌ళ‌వ‌రం క‌ర్ణాట‌క‌లోని మైసూర్ లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ప్ర‌సంగించారు.

బ‌స్వ‌రాజ్ బొమ్మై సార‌థ్యంలోని బీజేపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. అవినీతికి కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న చెందారు. వీరి బాధ ప‌డ‌లేక చాలా మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని దీనికి స‌ర్కారే బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. బొమ్మై బీజేపీ ప్ర‌భుత్వం దోచుకోవ‌డం , దాచుకోవ‌డానికే ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్రియాంక గాంధీ.

అన్ని రంగాల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన పాపాన పోలేద‌న్నారు. వీరి అవినీతి భ‌రించ లేక ఓ కాంట్రాక్ట‌ర్ సూసైడ్ నోట్ రాసి ప్రాణం తీసుకున్నాడ‌ని అయినా సీఎంకు, కేంద్రంలోని పీఎంకు సోయి రాలేద‌న్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, త‌మ‌కు ప‌ట్టం కట్టేందుకు రెడీగా ఉన్నార‌ని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!