Karnataka Govt : కర్ణాటకలో 8 మంది ఇంజనీర్లపై వేటు
కర్ణాటక ప్రభుత్వం బిగ్ షాక్
Karnataka Govt : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని సర్కార్ లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై నజర్ పెట్టారు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
తాజాగా కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 118 కోట్ల మేర నకిలీ బిల్లులు సృష్టించారు. ఇందుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది బీబీఎంపీ ఇంజనీర్లను కర్ణాటక ప్రభుత్వం సిద్దరామయ్య సిఫార్సుల మేరకు సస్పెండ్ చేసింది.
కటక రూరల్ ఇనఫ్రాక్చర్ డెవలప్ మెంట్ డీపీటీ ద్వారా గత 2 సంవత్సరాలుగా బెంగళూరు లోని ఆర్ఆర్ నగర్ జోన్ లో పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించారు. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి 2020 సంవత్సరంలో ఎంపీ డీకే సురేష్ ఫిర్యాదు చేశారు. నకిలీ బిల్లుల వ్యవహారంపై ఎంపీ కర్ణాటకకు చెందిన లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు.
నకిలీ బిల్లుల వ్యవహారంలో ఇంజనీర్ల ప్రమేయం ఉందని తేలడంతో చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టడంతో ప్రతిపక్ష బీజేపీలో కలకలం రేపుతోంది.
Also Read : Jagadish Shettar : జగదీశ్ శెట్టర్ కు ఎమ్మెల్సీ ఛాన్స్