P Ravindranath : కర్ణాటక ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా
ప్రభుత్వ వేధింపులే కారణమని ఆరోపణ
P Ravindranath : భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో నిజాయితీతో పని చేసే ఆఫీసర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంచాయతీరాజ్ మంత్రి నిర్వాకం కారణంగా ఓ సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది.
ఇంకో వైపు హిజాబ్ వివాదం కన్నడ రాష్ట్రంపై మరకలు తీసుకు వచ్చేలా చేసింది. ఈ తరుణంలో తాజాగా ఐపీఎల్ ఆఫీసర్ రాజీనామా చర్చనీయాంశంగా మారంది. కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ ఎక్కువ. ఇక ఇక్కడ అత్యధికంగా మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి.
ఇటీవల ఓ స్వామిజీ 40 శాతం కమీషన్ ఇస్తేనే కానీ తమకు నిధులు మంజూరు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల జోక్యం, అవినీతి అక్రమాలు పెచ్చరిల్లి పోవడంతో నిజాయితీ కలిగిన ఆఫీసర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం డీజీపీ స్థాయి ర్యాంక్ కలిగిన వేధింపులు తట్టుకోలేకు తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో నకిలీ కుల సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారిని ఐపీఎస్ ఆఫీసర్ పి. రవీంద్ర నాథ్ (P Ravindranath)గుర్తించారు.
కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆయన పోకడలు ప్రభుత్వానికి నచ్చ లేదు. సీఎస్ కు లేఖ రాసినా పట్టించు కోలేదు. డీసీఆర్ఈ డీజీపీ గా పని చేస్తున్న ఉన్న పళంగా పోలీస్ ట్రైనింగ్ కు బదిలీ చేశారు.
మనస్థాపం చెందిన రవీంద్రనాథ్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. అక్రమార్కులపై చర్యలు తీసుకున్నందుకే కొందరు కక్ష గట్టారంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. రూ. 2,500 కోట్లు ఇస్తే సిఎం పదవి ఇప్పిస్తామని చెప్పారని తెలిపారు.
Also Read : నోయిడా సిఇఓకు సుప్రీంకోర్టు షాక్