Karnataka Maharashtra : సరిహద్దు వివాదం బెలగావిలో ఉద్రిక్తం
ముదిరిన కర్ణాటక-మహారాష్ట్ర వివాదం
Karnataka Maharashtra : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం(Karnataka Maharashtra) మరింత ముదిరింది. బెలగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ట్రక్కులను లక్ష్యంగా చేసుకున్నారు ఆందోళనకారులు. మహారాష్ట్ర నంబర్ ప్లేట్లు ఉన్న ట్రక్కులను కన్నడిగులు నిలిపి వేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు.
దీంతో ఓ ట్రక్కుకు చెందిన విండ్ షీల్డ్ దెబ్బతింది. ఇదిలా ఉండగా బెలగావిలో కర్ణాటక రక్షణ వేదిక అనే సంస్థకు చెందిన నిరసనకారులు ట్రక్కును ధ్వంసం చేసినట్లు సమాచారం. పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా 1960లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర ఓ వైపు వాదిస్తోంది. ఆపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం కర్ణాటక, మరాఠాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
బెలగావి దాని పరిధిలోనే ఉంది. అయితే ఇటీవల కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో కొన్ని గ్రామాలను తాము కలుపుకుంటున్నట్లు తీర్మానం చేయడం మరింత ఉద్రిక్తతను రాజేసింది. విచిత్రం ఏమిటంటే రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రభుత్వాలే ఉండడం విశేషం.
అయినా సరిహద్దు వివాదం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా కర్ణాటక రక్షణ సంస్థకు చెందిన నిరసనకారులు ఆందోన చేపట్టారు. పోలీసులు చెప్పినా వినిపించు కోలేదు. ప్రస్తుతం బెలగావి పోలీసుల కనుసన్నలలో ఉంది.
Also Read : కేంద్ర పాలిత ప్రాంతాలకు పవర్స్ ఉండవు