Muruga Mutt Seer : మురుగ మ‌ఠాధిప‌తికి 4 రోజుల క‌స్ట‌డీ

వీల్ చైర్ లో కోర్టుకు వ‌చ్చిన శివమూర్తి

Muruga Mutt Seer : అత్యాచార ఆరోప‌ణ‌ల‌పై గురువారం అరెస్ట్ అయిన క‌ర్ణాట‌క లోని చిత్ర‌దుర్గ ముర‌గ మ‌ఠం మ‌ఠాధిప‌తి(Muruga Mutt Seer) శివ‌మూర్తిని వీల్ చైర్ లో కోర్టులో హాజ‌రు పరిచారు.

ధ‌ర్మాస‌నం నాలుగు రోజుల క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది. బ‌ల‌మైన లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ఠాధిప‌తిగా ఉన్నారు. ఎన్నో మ‌ఠాలున్నా మురుగ మ‌ఠానికి మంచి పేరుంది.

ప్ర‌స్తుతం మ‌ఠాధిప‌తి శివ‌మూర‌ర్తి మురుగ శ‌ర‌ణార్ కు 64 ఏళ్లు ఉన్నాయి. ఇద‌రు మైన‌ర్ బాలిక‌లు త‌మ‌పై మ‌ఠాధిప‌తి అత్యాచారానికి పాల్ప‌డ్డారంటూ ఫిర్యాదు చేశారు.

దీంతో పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఈ కేసు ఆరు రోజుల కింద‌ట న‌మోదైంది. మ‌ఠాధిప‌తికి(Muruga Mutt Seer) బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఆయ‌న‌కు శిష్యులుగా, అనుచ‌రులుగా, అభిమానులుగా ఉన్నారు.

బెంగ‌ళూరుకు 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది చిత్ర‌దుర్గ‌. సిటీ లోని ఒక ఆస్ప‌త్రి లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి వీల్ చైర్ పై ఇవాళ సాయంత్రం స్థానిక కోర్టుకు తీసుకెళ్లారు.

అక్క‌డ ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఉద‌యం చేరారు. విచార‌ణ నిమిత్తం ఐదు రోజుల ఆటు మ‌ఠాధిప‌తిని త‌మ వ‌ద్ద ఉంచాల‌ని పోలీసులు కోరారు కోర్టును.

కాగా నిందితుడిని జైలు నుంచి ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం ఇవ్వ‌లేదంటూ కోర్టు విమ‌ర్శించింది. మెడిక‌ల్ రిపోర్టులు ఇవ్వాల‌ని జైలు అధికారుల‌ను ఆదేశించింది.

రాత్రి 10. 30 గంట‌ల‌కు అరెస్ట్ చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల కార‌ణంగా ముందు జాగ్ర‌త్త‌గా పోలీసులు వ్య‌వ‌హ‌రించారు. అరెస్ట్ కు గంట‌ల ముందు మ‌ఠం ముందు త‌లుపుల‌ను బారికేడ్ చేశారు. వెనుక త‌లుపు ద్వారా తీసుకు వెళ్లారు మఠాధిప‌తిని.

Also Read : ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికి గ‌ర్వకార‌ణం

Leave A Reply

Your Email Id will not be published!