Sudham Das Row : సుధామ్ దాస్ నామినేట్ పై ఫైర్
కర్ణాటకలో మంత్రుల అభ్యంతరం
Sudham Das Row : కర్ణాటక ప్రభుత్వంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాజీ ఆఫీసర్ సుధామ్ దాస్(Sudham Das Row) వ్యవహారం కలకలం రేపింది. ఆయనను సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, దాస్ ను శాసన మండలికి నామినేట్ చేయాలని సిఫారసు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కేబినెట్ లో ఉన్న మంత్రులు.
Sudham Das Row Viral in Karnataka Govt
ఆయనను ఏ ప్రాతిపదికన నామినేట్ చేస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. ఈ లేఖ రాయడం కలకలం రేపింది. తాజాగా మాజీ ఆఫీసర్ సుధామ్ దాస్ నామినేట్ చేయడాన్ని వ్యతిరేకించిన వారిలో హోం శాఖ మంత్రి జి. పరమేశ్వర్ , కే. హెచ్ . మునియప్ప, హెచ్ సీ మహదేవప్ప, ఆర్బీ తిమ్మాపూర్ ఉన్నారు.
తొందరపడి నిర్ణయం తీసుకున్నారని వాపోయారు. విచిత్రం ఏమిటంటే మంత్రివర్గంలో ఉన్న తమను సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సంప్రదించ లేదని ఆరోపించారు. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే ఏఐసీసీ ఈయన ఎంపికపై పునరాలోచించాలని సూచించారు. ఎమ్మెల్సీలుగా ముందస్తుగా దీర్ఘ కాలంగా పార్టీ సభ్యులకు ముందుగా ఛాన్స్ కల్పిచాలని కోరారు.
Also Read : CM KCR BRS List : 21న బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్..?