Basava Siddalinga Swami : మ‌ఠాధిప‌తి సిద్ద‌లింగ స్వామి సూసైడ్

క్వార్ట‌ర్ లో శ‌వ‌మై క‌నిపించిన మ‌ఠాధిప‌తి

Basava Siddalinga Swami :  క‌ర్ణాట‌క‌లో మ‌ఠాధిప‌తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. శ్రీ గురు మ‌డివాళేశ్వ‌ర మ‌ఠం పీఠాధిప‌తిగా ఉన్న బ‌స‌వ సిద్ద‌లింగ స్వామి(Basava Siddalinga Swami) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

త‌న గ‌దిలో ఉరి వేసుకున్న‌ట్లు అనుచ‌రులు, ప‌రివారం వెల్ల‌డించారు. ఆయ‌న చని పోయి న‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా మ‌ఠాధిప‌తి వ‌ద్ద సూసైడ్ నోట్ దొరికింది.

ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌త్యేకించి లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ఠాలు ఎక్కువ‌గా ఉన్నాయి ఇక్క‌డ‌. మ‌త గురువుగా ప్ర‌సిద్ది పొందారు.

సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని బెలగావి జిల్లాలోని ఆయ‌న మ‌ఠంలో శ‌వ‌మై క‌నిపించారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఏమిటనేది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై ఇద్ద‌రు మ‌హిళ‌లు చ‌ర్చిస్తున్న‌ట్లు క‌నిపించిన వీడియో క‌ల‌క‌లం రేపింది. దీనిలో మ‌ఠం అధిప‌తి బ‌స‌వ సిద్ద‌లింగ స్వామి(Basava Siddalinga Swami) పూర్తిగా క‌ల‌త చెందిన‌ట్లు స‌మాచారం.

ఆ వీడియోలో ఉన్న మ‌హిళ‌లు మ‌ఠాధిప‌తి పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అంత‌లోపే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఈనెల ప్రారంభంలో క‌ర్ణాట‌క‌లో పేరొందిన చిత్ర‌దుర్గ లోని మురుగ మ‌ఠాధిప‌తిని లైంగిక వేధింపుల‌కు సంబంధించి అరెస్ట్ అయ్యారు. ఆయ‌న‌ను 14 రోజుల క‌స్ట‌డీకి త‌ర‌లించారు.

అయితే త‌న అరెస్ట్ వెనుక రాజ‌కీయ ప‌ర‌మైన కార‌ణాలు ఉన్నాయ‌ని, తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్నారు మురుగ మ‌ఠాధిప‌తి. ఇదిలా ఉండ‌గానే మ‌రో మ‌ఠాధిప‌తి సూసైడ్ చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : ఫ‌త్వాకు అద‌ర‌ను బెద‌ర‌ను – ఆసిఫా ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!