Mahaan Movie : కార్తీక్ సుబ్బ‌రాజ్ ‘మ‌హాన్’ రెడీ

ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ లో చాన్స్

Mahaan Movie  : కార్తీక్ సుబ్బ‌రాజ్ మోస్ట్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్ త‌మిళ మూవీలో. దిగ్గ‌జ న‌టుడు విక్ర‌మ్ కు ఇది 60వ సినిమా. ఈ చిత్రానికి ముందు చియాన్ 60 అని పేరు పెట్టాడు. త‌ర్వాత మ‌హాన్ (Mahaan Movie )గా మార్చాడు.

తండ్రీ కొడుకుల మ‌ధ్య జ‌రిగే ఎమోష‌నల్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా ఉంటుంద‌ని తెలిపాడు కార్తీక్ సుబ్బ‌రాజ్. తాను రూపొందించిన మ‌హాన్ వినోదాన్ని పంచేందుకు రెడీగా ఉంద‌న్నాడు.

ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌య్యేందుకు ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించాడు ద‌ర్శ‌కుడు సుబ్బరాజ్. ఇదిలా ఉండ‌గా మూవీకి సంబంధించి రిలీజ్ , ప్ర‌మోష‌న్స్ కు సంబంధించిన అప్ డేట్ లు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

అయితే మ‌హాన్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌తిదీ ప్లాన్ ప్ర‌కారం వ‌ర్క‌వుట్ అయితే మ‌హాన్ కార్తీక్ ఇది ప్రైమ్ కు రెండో మూవీ అవుతుంది.

దీనికి ముందు కార్తీక్ ఫ‌స్ట్ మూవీ ధ‌నుష్ న‌టించిన జ‌గ‌మే తంధిర‌మ్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ ద్వారా స్ట్రీమింగ్ అయ్యింది. కాగా మ‌హాన్ చిత్రాన్ని డార్క్ క్లౌడ్ స్టూడియో బ్యాన‌ర్ పై ల‌లిత్ కుమార్ నిర్మించారు.

సేతుప‌తి, రెక్క‌, మ‌హాన్ చిత్రాల‌లో న‌టించిన యువ న‌టుడు మాస్ట‌ర్ రాఘ‌వ‌న్ కూడా ఈ మ‌హాన్ లో భాగం కానుండ‌డం విశేషం. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను చెన్నై, గోవా, డార్జిలింగ్ లోని ప‌లు ప్రాంతాల్లో షూటింగ్ జ‌రిపారు.

ప్ర‌స్తుతానికి కార్తీక్ సుబ్బ‌రాజ్ మోస్ట్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్ల‌లో త‌మిళ సినిమాలో ఒక‌డిగా పేరు పొందాడు. మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరుంది.

Also Read : విడి పోయిన ధ‌నుష్ ఐశ్వ‌ర్య

Leave A Reply

Your Email Id will not be published!