Adani Karuna Time 100 : టైమ్ ప్రభావశీల వ్యక్తుల్లో అదానీ..కరుణ
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖుర్రం పర్వేజ్
Adani Karuna Time 100 : ప్రముఖ మ్యాగజైన్ టైమ్ ప్రతి ఏటా ప్రకటించే 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారతీయులకు చోటు దక్కింది.
ప్రముఖ వ్యాపార దిగ్గజం, ఆసియా కుబేరుడిగా పేరొందిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన కరుణ(Adani Karuna Time 100), జైలు శిక్ష అనుభవిస్తున్న ఖుర్రం పర్వేజ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
టైమ్ మ్యాగజైన్ 2022 సంవత్సరానికి వీరిని ఎంపిక చేసింది. భారత దేశంలో వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించేందుకు కారణమైన న్యాయవాదిగా పేరొందారు కరుణ , ప్రస్తుతం జైలులో ఉన్న మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్ కూడా ఉన్నారు.
కాశ్మీర్ లో తీవ్రవాద నిధుల కేసులో దర్యాప్తు జరుగుతోంది. వీరితో పాటు నెట్ ఫ్లిక్స్ లోని ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లో గ్లోబల్ టీవీ హెడ్ ఇండియన్ అమెరికన్ బేలా బజారియా కూడా టైమ్ జాబితాలో చోటు దక్కించుకుంది.
ఇటీవలే ఫోర్డ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ ర్యాంకులో ఉన్నారు అదానీ. టైమ్ జాబితాలో కూడా ఆయనకు చోటు దక్కింది.
ఇక ఈఏడాది ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ ప్రకటించిన 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో అదానీ(Adani Karuna Time 100) 7వ స్థానంలో నిలిచాడు.
ఏ సమయంలోనైనా $100 బిలియన్లకు పైగా విలువైన మూడో భారతీయ వ్యాపార సమ్మేళనాన్ని నిర్మించాడు అదానీ.
కరుణ నుండి కేవలం న్యాయవాదిగా మాత్రమే కాదు. మార్పు తీసుకు రావడానికి న్యాయస్థానం లోపల, వెలుపల తన గొంతును సమర్థవంతంగా , ధైర్యంగా ఉపయోగించే ప్రజా కార్యకర్త అని పేర్కొన్నారు మేనకా గురుస్వామి.
Also Read : యుద్దం విరమిస్తేనే శాంతి సాధ్యం