Kasireddy Narayan Reddy : క‌సిరెడ్డికే క‌ల్వ‌కుర్తి

వంశీ చంద‌ర్ కు షాక్

Kasireddy Narayan Reddy : హైద‌రాబాద్ – రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాను ప్ర‌క‌టించింది. భారీ ఎత్తున క‌స‌ర‌త్తు చేసింది. యువ నాయ‌కుడిగా , మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ చంద‌ర్ రెడ్డికి షాక్ ఇచ్చింది.

Kasireddy Narayan Reddy Contest from Kalvakurthi

ఇటీవ‌లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ గా ఉన్న క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డికి(Kasireddy Narayan Reddy) పార్టీ చోటు క‌ల్పించింది. ఈ మేర‌కు అత్యంత రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన నియోజ‌వ‌ర్గంగా పేరు పొందిన క‌ల్వ‌కుర్తికి అభ్య‌ర్థిగా ఛాన్స్ ఇచ్చింది.

ఇక్క‌డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జైపాల్ యాద‌వ్ ఉన్నారు. క‌సిరెడ్డి మొద‌టి నుంచీ ఈ సీటును ఆశిస్తూ వ‌చ్చారు. కీల‌క‌మైన పాత్ర పోషించారు గులాబీ పార్టీలో. కానీ బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ తాజాగా 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో ఉన్న‌ట్టుండి వెంట‌నే త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పారు క‌సిరెడ్డి.

రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా ప్ర‌క‌టించిన తొలి జాబితాలో రెడ్ల‌కే ప్ర‌యారిటీ ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Also Read : Ponguleti Tummala : ఆ ఇద్ద‌రికీ కోరుకున్న సీట్లు..?

Leave A Reply

Your Email Id will not be published!