Kathi Karthika Goud : దొర పాలనలో పేదలకు ఇళ్లేవి
టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కత్తి కార్తీక గౌడ్
Kathi Karthika Goud : రాష్ట్రంలో పేదల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి కార్తీక గౌడ్. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ పాలనను ఎండగట్టారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన హామీ అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Kathi Karthika Goud Asking
మోస పూరితమైన హామీలు ఇవ్వడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు కత్తి కార్తీక గౌడ్(Kathi Karthika Goud). ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రత్యేకించి దుబ్బాక నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం నత్త నడక నడుస్తోందన్నారు. లబ్దిదారులకు ఇప్పటి వరకు ఇళ్లు అందలేదని ఆరోపించారు కత్తి కార్తీక గౌడ్. తమ పార్టీ పవర్ లోకి వస్తుందని, సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు .
ప్రధాన రంగాలన్నీ పడకేశాయని, పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు కత్తి కార్తీక గౌడ్. బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఓట్లు సీట్లు తప్ప కేసీఆర్ కు ఏవీ పట్టవంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Rahul Gandhi Case : రాహుల్ కేసు ఆగస్టు 4కు వాయిదా