Kaushal Kishore : కౌశ‌ల్ కిషోర్ కామెంట్స్ పై క‌న్నెర్ర‌

క్యాబినెట్ నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్

Kaushal Kishore : దేశంలో శ్ర‌ద్దా వాక‌ర్ దారుణ హ‌త్య క‌ల‌క‌లం రేపింది. ఆమెను దారుణంగా హ‌త్య చేసిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ఆమె శ‌రీరం భాగాల‌ను 35 ముక్క‌లుగా చేసి ఛ‌త్త‌ర్ పూర్ , మెహ్రోలీ ప్రాంతాల్లో ప‌డేశాడు. ఈ ఘ‌ట‌న స‌భ్య స‌మాజాన్ని నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర మంత్రి కౌశ‌ల్ కిషోర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ హ‌త్య‌కు కార‌ణం త‌నేనంటూ బాధితురాలినే నిందించే ప్ర‌య‌త్నం చేశారు కౌశ‌ల్ కిషోర్. చ‌దువుకున్న బాలిక‌ల‌ను పేరెంట్స్ లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ కోసం ఎలా వ‌దిలి వేస్తారంటూ ప్ర‌శ్నించారు. దీనిపై మ‌హిళా సంఘాలు, ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున మండి ప‌డుతున్నారు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కౌశ‌ల్ కిషోర్(Kaushal Kishore) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్ర‌ద్దా వాక‌ర్ వెళ్ల‌డాన్ని పేరెంట్స్ వ్య‌తిరేకించారు. చ‌దువుకున్న అమ్మాయి స్వంతంగా నిర్ణ‌యం తీసుకుంది. అది పూర్తిగా పొర‌పాటు. త‌ప్పంతా ఆమెదేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీరు నిజంగా ఎవ‌రితోనైనా ప్రేమ‌లో ప‌డితే ముందుగా పెళ్లి చేసుకోండి ..ఈ లివ్ ఇన్ రిలేష‌న్ ఏమిటి అంటూ ప్ర‌శ్నించారు.

ఇలాంటి వాటి వ‌ల్ల‌నే నేరాలు కొన‌సాగుతున్నాయ‌ని మండిప‌డ్డారు. కేంద్ర మంత్రి కామెంట్స్ ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది. అత్యంత క్రూర‌మైన , దారుణ‌మైన సంఘ‌ట‌న‌. ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం దారుణం. ముందుగా కౌశ‌ల్ కిషోర్ ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Also Read : అజామ్ ఖాన్ కు అఖిలేష్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!