Kaushik Basu : ప‌త‌నం అంచున ఆర్థిక భార‌తం – కౌశిక్ బ‌సు

ప్ర‌ముఖ ఆర్థిక వేత్త సంచ‌ల‌న కామెంట్స్

Kaushik Basu : ప్ర‌పంచ బ్యాంక్ మాజీ ఆర్థిక వేత్త‌, కార్నెల్ యూనివ‌ర్శిటీ ఎక‌నామిక్స్ ప్రొఫెస‌ర్ కౌశిక్ బ‌సు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం అంచున ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం ఇంకో వైపు నిరుద్యోగం దేశాన్ని అత‌లాకుత‌లం చేసే స్థితికి చేరుకుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచ బ్యాంకు గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌మాదంలో ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

విచిత్రం ఏమిటంటే మ‌నకంటే చిన్న దేశాలు ఆర్థికంగా ముందంజ‌లో ఉన్నాయ‌ని కానీ ఈరోజు వ‌ర‌కు పాల‌క ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క పోవ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న చెందారు కౌశిక్ బ‌సు(Kaushik Basu).

ఒక ర‌కంగా ఆయ‌న ప‌ర‌క్షోంగా భీజేపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, నిర్ణ‌యాల‌పై విమ‌ర్శించారు. కౌశిక్ బ‌స్సు తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక విజ‌న్ అంటూ లేక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. తాజాగా ప్ర‌పంచ బ్యాంకు డాటాను ప‌రిశీలిస్తే 2020-22 లో భార‌త వార్షిక వృద్ధి రేటు 0.8 శాత‌మే ఉంద‌ని తెలిపారు.

చైనా, వియ‌త్నాం, బంగ్లాదేశ్ తో పాటు ఇత‌ర దేశాల కంటే చాలా త‌క్కువ అని స్ప‌ష్టం చేశారు. ప్రాధాన్యాల ఎంపిక‌లో చేసిన పొర‌పాట్లు కార‌ణంగానే దేశంలో ఆర్థిక ప‌రిస్థితి ఇంతలా దిగ‌జారేందుకు కార‌ణ‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు కౌశిక్ బ‌సు(Kaushik Basu).

ఆయ‌న చేసిన ట్వీట్ ను సపోర్ట్ చేశారు మంత్రి కేటీఆర్. మోదీ స‌ర్కార్ ప‌నితీరుకు ఈ వ్యాఖ్య‌లు అద్దం ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు.

Also Read : స్వేచ్ఛ‌పై ప‌హ‌రా లేద‌న్న ఓం బిర్లా

Leave A Reply

Your Email Id will not be published!