Tarun Chug : బిడ్డ‌ లిక్క‌ర్ క్వీన్ తండ్రి అవినీతిలో డాన్

బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్

Tarun Chug TS BJP : భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్ నిప్పులు చెరిగారు. ఆయ‌న క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బిడ్డ లిక్క‌ర్ క్వీన్ అని, తండ్రి అవినీతిలో డాన్ అని కామెంట్స్ చేశారు. ఆదివారం వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. రాణి రుద్ర‌మ‌దేవి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి కోర్ క‌మిటీ స‌భ్యుల‌తో త‌రుణ్ చుగ్ స‌మావేశం అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు త‌రుణ్ చుగ్(Tarun Chug TS BJP).

క‌ల్వ‌కుంట్ల కుటుంబం తెలంగాణ పేరుతో దోపిడీకి పాల్ప‌డుతోంద‌న్నారు. ఇప్ప‌టికే వ‌న‌రుల‌ను ధ్వంసం చేసింద‌ని, కాంట్రాక్టుల పేరుతో కోట్లాది రూపాయ‌లు దోచుకుందన్నారు త‌రుణ్ చుగ్. దోచుకోవ‌డం ఆ త‌ర్వాత దాచు కోవ‌డంపైనే పాల‌న సాగుతోంద‌న్నారు.

తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఆ ఫ్యామిలీపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. లిక్క‌ర్ స్కాం తాము చేయ‌మ‌ని చెప్పామా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఆడ‌బిడ్డ‌లు ఆత్మ గౌర‌వం క‌లిగిన వార‌ని, కానీ వారి ప‌రువు తీసిన ఘ‌న‌త క‌ల్వ‌కుంట్ల క‌విత‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు.

ఈడీ విచార‌ణ జ‌రిపితే త‌మ‌కు సంబంధం అంట గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని, తామేమైనా లిక్క‌ర్ దందా చేయ‌మ‌ని క‌విత‌కు చెప్పామా అని ప్ర‌శ్నించారు త‌రుణ్ చుగ్. సౌత్ గ్రూప్ లో ఉన్న‌ది ఎవ‌రో ఈడీ బ‌ట్ట‌బ‌య‌లు చేసింద‌న్నారు. తెలంగాణ‌లో పారిస్తున్న మ‌ద్యాన్ని ఢిల్లీకి పాకేలా చేసింది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు బీజేపీ నేత‌. రూ. 100 కోట్లు కొల్ల‌గొట్టిన వాళ్లు తీహార్ జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు త‌రుణ్ చుగ్(Tarun Chug TS BJP).

Also Read : త‌ప్పైంది మ‌న్నించండి – రాజ‌య్య

Leave A Reply

Your Email Id will not be published!