KC Venu Gopal : కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కేసీ ఫోకస్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
KC Venu Gopal : కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రాబోయే ఎన్నికలకు సంబంధించి ఫోకస్ పెట్టారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గాంధీ భవన్ లో జరిగిన ఈ కీలక భేటీలో కేసీ వేణుగోపాల్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర ఎన్నికల అబ్జర్వరర్ దీపా దాస్ మున్షి, కార్యదర్శులు శ్రీధర్ బాబు, రోహిత్ చౌదరి, విశ్వనాథ్, మన్సూర్ అలీ , వంశీ చందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ , ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజ నరసింహ హాజరయ్యారు.
KC Venu Gopal Instructs
ఈ సందర్భంగా కేసీ వేణు గోపాల్ మాట్లాడారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఇక నుంచి ప్రతి రోజూ మనందరికీ ముఖ్యమైనదని స్పష్టం చేశారు. అనవసర విషయాలను పట్టించు కోవద్దని సూచించారు. మనముందున్న లక్ష్యం ఒక్కటేనని అది కేవలం తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించు కోవడం మాత్రమేనని పేర్కొన్నారు కేసీ వేణు గోపాల్.
ఆయా నియోజకవర్గాలలో ఎవరు కూడా పార్టీ నియంత్రణ రేఖ దాటకుండా చూడాలని , సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా కేసీ వేణుగోపాల్ పోస్టుమార్టం నిర్వహించడం విశేషం.
Also Read : MLA Raja Singh : వచ్చే అసెంబ్లీలో నేను ఉండను