KC Venu Gopal : న్యూఢిల్లీ – ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రైతు బంధును తాము అడ్డుకోలేని స్పష్టం చేశారు. కోరి కొని తెచ్చుకున్న బాధ్యతా రాహిత్యమని పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన కామెంట్స్ ఆ పార్టీని కొంప ముంచేలా చేశాయని ఎద్దేవా చేశారు.
KC Venu Gopal cComments on KCR
తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీ బురద చల్లుతున్నారంటూ ఆరోపించారు కేసీ వేణుగోపాల్(KC Venu Gopal). రైతు బంధుకు సంబంధించి నవంబర్ 25న ఈసీ అనుమతి ఇచ్చిందని, ఇందుకు సంబంధించి పంపిణీ చేసుకోవచ్చని తెలిపింది. అయితే కొన్ని కండీషన్స్ పెట్టింది.
లబ్దిదారులైన రైతులకు జమ చేయొచ్చని కానీ ఎన్నికల ప్రచారానికి వాడుకో కూడదని స్పష్టం చేసిందన్నారు. రైతు బంధు డబ్బులు రైతుల హక్కు అని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్. హరీష్ రావు వల్లనే రైతు బంధు ఆగి పోయిందని ఆరోపించారు.
కేసీఆర్ సూచనల మేరకే ఈసీ నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇలాంటి బాధ్యతా రాహిత్య ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. గతంలో ఎందుకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు ఆలోచించ లేదని మండిపడ్డారు.
Also Read : Bhatti Vikramarka : కేసీఆర్ నిర్వాకం రైతు బంధు ఆలస్యం