KCR Budha : బుద్దుని మార్గం తెలంగాణ పయనం
గౌతముడి బోధనలు అనుసరణీయం
KCR Budha : ప్రపంచ మానవాళికి నడతను నేర్పిన మహనీయుడు గౌతమ బుద్దుడు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బుద్ద పూర్ణిమ సందర్భంగా ఆయన బుద్దునిని స్మరించుకున్నారు.
గౌతముడి జయంతి సందర్భంగా ప్రపంచంలోని బౌద్దులకు శుభాకాంక్షలు తెలిపారు. సమస్త లోకానికి ఆయన చూపిన మార్గమే అనుసరణీయమని స్పష్టం చేశారు. బుద్దుని బోధనలు ఎప్పటికీ తనను ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు.
బోధించిన బోధనలు, అనుసరించిన మార్గాలు, జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయమని సూచించారు కేసీఆర్(KCR Budha) . బుద్దుడు నేర్పించిన శాంతి, సహనం, అహింస, సత్యం, ధర్మ బద్దత, సత్య మార్గం అన్నీ ఇప్పుడు తాము పాలనలో ప్రతిఫలించేలా చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం.
ఏళ్లు గడిచినా తరాలు మారినా బుద్దుడి అవసరం ఇంకా ఉందన్నారు. తెలంగాణ పవిత్ర భూమి బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా విలసిల్లుతోందన్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(KCR Budha).
ప్రకృతి రమణీయత ఉట్టి పడేలా పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాగార్జునాసాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో బుద్దవనం కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేశామని వెల్లడించారు కేసీఆర్. బుద్దుని జీవిత చరిత్ర, బోధనలు, సమస్త సమాచారం ఇందులో లభిస్తుందన్నారు.
ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం గా మారనుందన్నారు సీఎం. బుద్దుని మార్గంలో తాము ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ సమాజం బుద్దుడి ప్రబోధనలతో ప్రభావితం చెందిందని వెల్లడించారు సీఎం.
Also Read : శ్రీవారి సన్నిధిలో కంగనా రనౌత్