KCR CM : ఆరు నూరైనా ఆర్టీసీని అమ్మం – కేసీఆర్

అమ్మాలంటూ కేంద్రం లేఖ‌లు

KCR CM : ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ను అమ్మే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్(KCR CM). తెలంగాణ అసెంబ్లీలో సోమ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఆర్టీసీని అమ్మాలంటూ కేంద్రం త‌మ‌కు లేఖ‌లు రాస్తోందంటూ ఆరోపించారు. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌పై స్వ‌ల్ప కాలిక చ‌ర్చ జ‌రిగింది.

ప్ర‌స్తుతం ఆర్టీసీ సంస్థ మెల మెల్ల‌గా కోలుకుంటోంద‌న్నారు సీఎం(KCR CM). గ‌తంలో కాపాడుకుంటూ వ‌చ్చిన ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అమ్ముకుంటూ పోతున్నార‌ని, చివ‌ర‌కు వ్య‌వ‌సాయం, విద్యుత్ సంస్థ‌ల‌ను అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు సంబంధించిన స్నేహితులైన షావుకార్ల‌కు ల‌బ్ది చేకూర్చేందుకే ఇలా చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు కేసీఆర్. ఇదే స‌మ‌యంలో మీట‌ర్ పెట్ట‌కుండా విద్యుత్ క‌నెక్ష‌న్ ఇవ్వ వ‌ద్దంటూ ఆరోపించారు.

గెజిట్ కూడా మంజూరు చేసింద‌న్నారు. ఏపీలోని శ్రీ‌కాకుళంలో మీట‌ర్ పెడితే రైతులంతా కుప్ప‌లు పోసి ధ‌ర్నా చేశార‌ని గుర్తు చేశారు. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఉచిత క‌రెంట్ అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశారని తెలిపారు.

అక్క‌డ రైతుల ఆధ్వ‌ర్యంలో త‌గుల బెట్టారంటూ చెప్పారు కేసీఆర్. యూపీలో నాలుగు జిల్ల‌ల‌కు చెందిన రైతులంతా క‌రెంట్ ఆఫీసుల వ‌ద్ద మీట‌ర్లు పోసి ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశార‌ని చెప్పారు సీఎం.

భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు చెబుతున్న మాట‌ల‌న్నీ శుద్ద అబ‌ద్దాలంటూ ఆరోపించారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నారు కేసీఆర్.

మేం అమ్ముతున్నాం మీరు కూడా అమ్మాలంటూ త‌మ‌పై వ‌త్తిళ్లు తీసుకు వ‌స్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : వ్య‌వ‌సాయం..విద్యుత్ అమ్మేందుకు కుట్ర‌

Leave A Reply

Your Email Id will not be published!