KCR: కేసీఆర్‌కు పవర్‌ కమిషన్‌ నోటీసులు !

కేసీఆర్‌కు పవర్‌ కమిషన్‌ నోటీసులు !

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కు మంగళవారం పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలలో తన పాత్రను తెలియజేయాలని ఆయన్ని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. పవర్‌ కమిషన్‌ నోటీసుల ప్రకారం… జూన్‌ 15వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే… జూలై 30 వరకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని పవర్‌ కమిషన్‌ సంకేతాలిస్తోంది.

KCR Case

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్‌ కమిషన్‌ నియమించింది తెలంగాణ సర్కార్‌. ఈ క్రమంలో కమిషన్‌ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్‌ఎస్‌ హయాంలో పని చేసిన కొందరు అధికారుల్ని విచారణకు పిలిచి… వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది ఈ కమిషన్‌. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్‌రావును ప్రశ్నించిన జస్టిస్‌ నరసింహారెడ్డి.. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించడం గమనార్హం.

Also Read : Mohan Charan Majhi: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్‌ మాఝీ !

Leave A Reply

Your Email Id will not be published!