Bandi Sanjay : ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కేసీఆర్
నిప్పులు చెరిగిన బండి సంజయ్
Bandi Sanjay : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. జగిత్యాల జిల్లాలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, కేవలం ప్రగతి భవన్ కే పరిమితమై పోయిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రజలు సీఎం కేసీఆర్ ను నమ్మే స్థితిలో లేరన్నారు.
స్కాంలకు తెలంగాణ కేరాఫ్ గా మారి పోయిందని ఆరోపించారు బండి సంజయ్(Bandi Sanjay). ఉద్యమ సమయంలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సమయంలో లెక్కలేనన్ని హామీలు ఇచ్చారని అందులో ఏ ఒక్కటి నెరవేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. గిరిజనులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య చిచ్చు పెట్టిన ఘనత సీఎందేనని పేర్కొన్నారు.
మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలేందుకు సిద్దంగా ఉన్నాయని వాటి గురించి ఫోకస్ పెట్టక పోవడం దారుణమన్నారు. ఇక రాష్ట్రంలో 2 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు. పోస్టుల భర్తీ ఓ నాటకమని, అది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఆరోపించారు బండి సంజయ్ కుమార్ పటేల్.
ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. వెంటనే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు ఎడా పెడా వేసినంత మాత్రాన నిరుద్యోగులు ఓట్లు వేస్తారని అనుకోవడం భ్రమ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా హాజరవుతారని వెల్లడించారు బండి సంజయ్.
Also Read : సింగరేణి కాదది కల్వకుంట్ల కంపెనీ