KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు చెబుతానని వనపర్తి వేదికగా జరిగిన సభలో ప్రకటించారు.
ఈనెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. ఒకప్పుడు పాలమూరు అంటేనే కరవుకు ఆలవాలంగా ఉండేదని కానీ నేడు పచ్చని పాలమూరుగా మారి పోయిందన్నారు.
నాకు నిజమైన స్నేహితుడు నిరంజన్ రెడ్డి అని కితాబు ఇచ్చారు. నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేస్తానని చెప్పారు కేసీఆర్(KCR ). తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా కొట్లాడతానని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. కిస్తీ కట్టాల్సిన అవసరం లేదన్నారు.
వడ్డీ కూడా లేదన్నారు. గతంలో నీళ్ల కోసం , నిధుల కోసం, కరెంట్ కోసం నానా ఇక్కట్లు పడ్డామన్నారు. కానీ ఇతర వర్గాల వారందరూ దళిత బిడ్డలకు, కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.
దేశం యావత్ మన వైపు చూస్తోందని చెప్పారు. గతంలో చాలా సార్లు నేను, ప్రొఫెసర్ జయశంకర్ సారు కలిసి తిరిగినం. ఆనాడు ఈ గోస చూసి కన్నీళ్లు పెట్టుకున్నం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు కేసీఆర్.
వ్యక్తిగతంగా తనను తిట్టినా పట్టించు కోలేదు. కావాలని అనుకున్న స్వంత రాష్ట్రం సాకారం అయ్యిందన్నారు. జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ లేదు. కానీ ఇప్పుడు ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ మంజూరు చేశామన్నారు.
Also Read : మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి