TS CM KCR : మునుగోడులో గెలుస్తం దేశాన్ని ఏలుతం
ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన సీఎం
TS CM KCR : సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుస్తామని, రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి దేశాన్ని ఏలడం ఖాయమని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పునాది రాయి ఎక్కడో కాదు నా మునుగోడేనని స్పష్టం చేశారు. మీరిచ్చే తీర్పు కోసం యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తోందని అన్నారు సీఎం కేసీఆర్.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేసీఆర్(TS CM KCR) ప్రసంగించారు. అన్ని రకాలుగా మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఇదే మీరంతా ఈ దేశపు భవిష్యత్తుకు పునాది రాళ్లు అని కొనియాడారు. యావత్ దేశమంతా మీరిచ్చే తీర్పు ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.
ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి కాబోతోందన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని చెప్పారు కేసీఆర్. నేను ప్రారంభించిన బీఆర్ఎస్ యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాదన్న సన్నాసులు రాష్ట్రం వచ్చాక మళ్లీ మొరగడం ప్రారంభించారని ఎద్దేవా చేశారు కేసీఆర్. వామపక్ష, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు తాను విన్నవిస్తున్నా మీరంతా కలిసికట్టుగా గులాబీ జెండా ఎగుర వేసేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు సీఎం.
ఒక నాడు సిద్దిపేట నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం బయలుదేరా. ఇప్పుడు మునుగోడు నుంచి దేశాన్ని ఏలేందుకు బయలు దేరుతున్నానని అన్నారు కేసీఆర్.
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా , మోదీ తలకిందులు చేసినా మునుగోడులో అపజయం ఖాయమన్నారు సీఎం.
Also Read : బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తా – కేసీఆర్