KCR Hemant Soren : జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ ములాఖాత్

దేశ రాజ‌కీయాల‌పై కీల‌క చ‌ర్చ

KCR Hemant Soren  : దేశంలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా ప్ర‌త్యామ్నాయ వేదిక‌ను ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆయ‌న ఇప్ప‌టికే త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. కేంద్రం పెత్త‌నాన్ని తాము స‌హించ బోమంటూ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. ఈ త‌రుణంలో కేసీఆర్ ఇవాళ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ (KCR Hemant Soren )తో భేటీ అయ్యారు. శిబూ సోరేన్ తో కూడా క‌లుసుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాల‌నే దానిపై చ‌ర్చించారు.

ఈ భేటీ కంటే ముందు సీఎం కేసీఆర్ రాంచీ లోని గిరిజ‌న ఉద్య‌మ‌కారుడు బిర్సా ముండా విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. బిర్సా ముండా గిరిజ‌న జాతికి ఈ దేశానికి అందించిన సేవ‌లను ప్ర‌స్తుతించారు.

గ‌త ఏడాది గ‌ల్వాన్ లోయ‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో వీర మ‌ర‌ణం పొందిన సైనికుల కుటుంబాల‌కు ఇద్ద‌రు సీఎంలు కేసీఆర్, హేమంత్ సోరేన్ ఆర్థిక సాయం అంద‌జేశారు.

ఇదిలా ఉండ‌గా వీర జ‌వాను కుంద‌న్ కుమార్ ఓఝా స‌తీమ‌ణి న‌మ్ర‌త కుమారి, గ‌ణేష్ హ‌న్స‌దా త‌ల్లి క‌ప్రాహ‌న్స‌దాల‌కు రూ. 10 ల‌క్ష‌ల చొప్పున చెక్కుల‌ను సీఎం అంద‌జేశారు. మొత్తంగా ఇవాళ సీఎం కేసీఆర్ భేటీ అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Also Read : రైతుల కోసం కాంగ్రెస్ ఉద్యమం

Leave A Reply

Your Email Id will not be published!