KCR Orphan Childrens : అనాథ‌ల కోసం స‌ర్కార్ ముంద‌డుగు

రేప‌టి భ‌విష్య‌త్తుకు సాధికార‌త‌

KCR Orphan Childrens : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో, ఏ రాష్ట్రంలో అమ‌లు చేయ‌ని విధంగా ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఉన్న అనాథ‌ల గురించి ఆలోచించింది. వారికి ఎవ‌రూ అండ‌గా నిల‌వ‌క పోవ‌డాన్ని గుర్తించింది. ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే ప‌లుమార్లు ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు సీఎం కేసీఆర్. ఈ మేర‌కు భావి త‌రాలు గ‌ర్వ ప‌డేలా అనాథల‌ను ప్ర‌భుత్వ‌మే ద‌త్త‌త తీసుకునేలా ప్లాన్ చేశారు.

KCR Orphan Childrens Organization

రేప‌టి భ‌విష్య‌త్తుకు సాధికార‌త క‌ల్పించే దిశ‌గా కేసీఆర్(KCR) అడుగులు వేశారు. ఈ మేర‌కు అనాథల కోసం తెలంగాణ ప్ర‌గ‌తి శీల అడుగులు వేసేలా ప్ర‌య‌త్నించారు. భార‌త దేశంలో దాదాపు 15.8 కోట్ల మంది పిల్ల‌లు 6 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు క‌లిగిన వారు ఉన్నారు. వారిలో 3 కోట్ల మంది అనాథ‌లు ఉన్నారు. వారిలో కేవ‌లం ఒక శాతం మంది మాత్ర‌మే పిల్ల‌ల సంర‌క్ష‌ణ సంస్థ‌ల‌లో సేద దీరుతున్నారు.

ఈ ముఖ్య‌మైన స‌మ‌స్య‌ను ప్ర‌త్యేకంగా గుర్తించారు సీఎం కేసీఆర్. అంతే కాదు దేశంలోనే అనాథ‌ల గురించి ప్ర‌త్యేకంగా పాల‌సీని తీసుకు రావాల‌ని నిర్ణ‌యించిన ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ‌ది కావ‌డం విశేషం.

వినూత్న‌మైన అనాథ విధానం అమ‌లు ద్వారా త్వ‌ర‌లో అనాథ‌లను రాష్ట్ర పిల్ల‌లుగా ద‌త్త‌త తీసుకోనుంది. ఈ నిర్ణ‌యం చారిత్రాత్మ‌కం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read: K Annamalai : అవినీతిమ‌యం డీఎంకే ప్ర‌భుత్వం

Leave A Reply

Your Email Id will not be published!