KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత ప్రస్థానంలో తాను కోరుకున్న కలను సాకారం అయ్యేలా చేశారు. పట్టు వదలని విక్రమార్కుడిగా పేరొందిన కేసీఆర్(KCR) ఈ ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం ఆవిష్కృతమైంది. ఇవాళ పూజ చేసి మల్లన్న జలాశయాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
స్విచ్ ఆన్ చేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు కేసీఆర్(KCR). ఏరియల్ వ్యూ ద్వారా సీఎం ప్రాజెక్టును పరిశీలించారు. తెలంగాణ ప్రాంతానికే ఈ జలాశయం సెంటర్ గా మారనుంది.
ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం ఇదే కావడం విశేషం. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ అద్బుత జలశాయానికి అయిదు తూములు ఉన్నాయి.
వీటి ద్వారానే కొండ పోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ కు , సింగూరు ప్రాజెక్టుకు, తపాస్ పల్లి రిజర్వాయర్ కు, మిషన్ భగరీథకు నీటిని తరలిస్తారు.
ఇదిలా ఉండగా ఈ రిజర్వాయర్ కింద మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలోని పలు ప్రాంతాలకు గ్రావిటీ ( ఎత్తి పోయడం ) ద్వారా తరలించనున్నారు.
ఈ ఒక్క మల్లన్న జలాశయం కింద లక్షా 25 ఎకరాలకు పైగా సాగు నీరు అందనుంది. ఎనిమిది లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరు అందజేసే అవకాశం ఉంది.
ఏది ఏమైనా కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత భారీ ఎత్తున చేపట్టిన జలాశయం అందుబాటులోకి రావడంతో రైతులు, ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తా