YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిరుద్యోగుల సమస్యపై పోరాడేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆవేదన చెందారు. ఓ వైపు లక్షల్లో జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. నిధులు, నియామకాలు, నీళ్లు పేరుతో వచ్చిన తెలంగాణలో కేవలం అన్ని పదవులు, జాబ్స్ , నీళ్లు, నిధులు కేవలం ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకే పోయాయని మండిపడ్డారు.
సోమవారం పార్టీ ఆధ్వర్యంలో టీ – సేవ్ (తెలంగాణను రక్షించుకుందాం) అనే పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆమె అన్ని పార్టీలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొందరితో ఫోన్ లో కూడా సంప్రదించారు. స్వయంగా షర్మిల(YS Sharmila) తెలంగాణ జన సమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా నిరుద్యోగుల కోసం పోరాడుతున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అదే సమయంలో ఈ న్యాయపరమైన డిమాండ్ సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి , ఆందోళనలకు , నిరసనలకు ముందుండి నాయకత్వం వహించాలని విన్నవించారు. ఓ వైపు నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే ఇంకో వైపు పదో తరగతి పరీక్షలు లీకులు కావడం దారుణమన్నారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ లో చోటు చేసుకున్న లీకేజీలపై ఎందుకు దోషుల గురించి బయట పెట్టడం లేదంటూ ప్రశ్నించారు.
Also Read : కేసీఆర్ పై పొంగులేటి కన్నెర్ర