KTR : కేసీఆర్ ప్ర‌సంగం భావి త‌రాల‌కు పాఠం

స్ప‌ష్టం చేసిన ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి కేటీఆర్

KTR : మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇవాళ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌సంగం భావి త‌రాల‌కు ఓ పాఠం లాగా మిగిలి పోతుంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌త్యేకించి దేశం ప‌ట్ల సీఎంకు ఉన్న అవ‌గాహ‌న‌, ముందు చూపు క‌నీసం కేంద్రంలో కొలువు తీరిన ఏ ఒక్కరికీ లేక పోయింద‌ని మండిప‌డ్డారు. ప్ర‌త్యేకించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు మంత్రి కేటీఆర్(KTR).

సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌సంగం, చెప్పిన విష‌యాలు రాజ‌కీయ శాస్త్రంలో ప్ర‌తి విద్యార్థికి అద్భుత‌మైన పాఠాలుగా ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా కొంద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు రాలేని వారు కూడా ఉన్నార‌ని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇదిలా ఉండ‌గా ముందు చూపు లేకుండా పాల‌న సాగించ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌ప్ప ఏవీ ఉండ‌వ‌న్నారు.

దేశంలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని, వాటిని గుర్తించి స‌ద్వినియోగం చేసుకోగలిగితే ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, ఆయిల్, గ్యాస్ స‌మ‌స్య‌లు అన్న‌వి ఉండ‌నే ఉండ‌వ‌ని పేర్కొన్నారు కేటీఆర్.

ఎంత సేపు ప్రాంతం, కులం, మ‌తం పేరుతో ఇంకెంత కాలం రాజ‌కీయాలు చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఒక‌ప్పుడు ఐటీ అంటే బెంగ‌ళూరు అని చెప్పే వార‌ని కానీ తాము తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు.

ఇవాళ ప్ర‌పంచంలోని టాప్ కంపెనీల‌న్నీ హైద‌రాబాద్ జ‌పం చేస్తున్నాయ‌ని తెలిపారు. అంతే కాదు ఐటీ రంగంలోనే కాదు అన్ని రంగాల‌లో దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు కేటీఆర్.

Also Read : మోదీపై నిప్పులు చెరిగిన కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!