Kedarnath Dham : కేదార్ నాథ్ ధామ్ ప్రత్యేకం
తెరిచే తేదీని ప్రకటించిన కమిటీ
Kedarnath Dham : దేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్ నాథ్ ధామ్ కు భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శ్రీ బద్రినాథ్ – కేదార్ నాథ్(Kedarnath Dham) ఆలయ కమిటీ వేడుక సోకం ప్రత్యేక సన్నాహాలు చేసింది. ఆలయ సముదాయం మొత్తం పూలతో అలంకరించారు. సోమవారం రుద్రప్రయాగ్ లో భారీ హిమపాతం తర్వాత కేదార్ నాథ్ ధామ్ మంచుతో కప్పబడి ఉంది. 12 జ్యోతిర్లంగాలలో ఒకటిగా పేరు పొందింది శ్రీ కేదార్ నాథ్.
ఏప్రిల్ 25న తెరబడుతుందని ఉఖిమత్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపింది. సంప్రదాయం ప్రకారం మహా శివరాత్రి శుభ సందర్భంగా తలుపులు తెరిచే తేదీని నిర్ణయించారు. ఈ సీజన్ లో శ్రీ కేదార్ నాథ్ ఆలయం(Kedarnath Dham) కపట్ మూసి వేశారు. ఓంకారేశ్వర్ ఆలయం శితాకాలలో దర్శనం చేసుకునేందుకు వీలుంటుంది. ఇక శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓంకారేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే ధార్మిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
దేవుడిని అలంకరించిన అనంతరం ఆలయ అర్చకులు గర్భ గుడిలో మహాభిషేకం చేశారు. భోగాన్ని సమర్పించారు. వేదపతి పంచాంగ్ కేదార్ నాథ్ ధామ్ తలుపులు తెరిచే తేదీని వెల్లడించారు. ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలో విద్యా పీఠం విద్యార్థులు , కార్యకర్తలు, ఆలయ కమిటీకి చెందిన మహిళా మంగళ్ దళ్ భజన కీర్తన రోజంతా కొనసాగుతోంది.
బసంత్ పంచమి సందర్భంగా నరేంద్ర నగర్ లోని రాజ మహల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పూజలు చేశారు.
Also Read : శివరాత్రి పర్వదినం పోటెత్తిన భక్తజనం