Kerala CM Sisodia : సిసోడియా అరెస్ట్ పినరయ్ సీరియస్
ప్రధానమంత్రి మోదీ నిద్ర పోతున్నారా
Kerala CM Sisodia : కేరళ సీఎం పినరయ్ విజయన్ కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఆప్ అగ్ర నాయకుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ఈ దేశంలో డెమోక్రసీ అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రానికి, ప్రధాని మోదీకి దాసోహం అయ్యాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కేవలం బీజేపీయేతర రాష్ట్రాలను, సీఎంలు, మంత్రులు, నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు పినరయ్ విజయన్. మనీష్ సిసోడియాకు సంబంధించిన వ్యవహారంపై పునరాలోచించాలని కోరుతూ తొమ్మిది మంది పార్టీల నేతలు పీఎంకు లేఖ రాశారు. వారు రాసిన లేఖ రెండో రోజుల తర్వాత కేరళ సీఎం(Kerala CM Sisodia) స్పందించడం విశేషం. ఈ అరెస్ట్ కేంద్ర సంస్థల చర్యలకు సంబంధించిన వాదనకు మరింత బలం చేకూరినట్లయిందని విజయన్ పేర్కొన్నారు.
రాజకీయ కారణాలతో ఆప్ నేతను టార్గెట్ చేశారన్న అభిప్రాయాన్ని తొలగించాల్సిన అవసరం, బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు సీఎం. ఈ మేరకు కేరళ సీఎం పీఎంకు లేఖ రాశారు. మద్యం స్కాంలో ఎవరున్నా వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ వ్యక్తులను కావాలని టార్గెట్ చేయడం మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు పినరయ్ విజయన్.
సిసోడియా విషయంలో నగదు స్వాధీనం వంటి నేరపూరిత సాక్ష్యాలు ఎక్కడా లభించలేదని ఆ విషయాన్ని పీఎం గుర్తించాలన్నారు విజయన్.
Also Read : రాహుల్ కు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు