Kerala CM Tribute : అరుదైన నేత ఊమెన్ చాందీ – సీఎం
ఆప్తుడిని కోల్పోయానని ఆవేదన
Kerala CM Tribute : సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మంగళవారం బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. కేరళ సీఎం పినరయ్ విజయన్(Pinarayi Vijayan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రం గొప్ప నాయకుడిని, అంతకు మించిన ఆప్తుడిని కోల్పోయిందంటూ పేర్కొన్నారు సీఎం.
ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టాం. మా ఇద్దరి భావజాలాలు వేర్వేరు. మా పార్టీలు కూడా వేరే. ఆయన లౌకికవాదాన్ని నమ్మే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేను పూర్తి వామపక్ష పార్టీలో కొనసాగుతూ వచ్చాను. కానీ ఏనాడూ మేం పోట్లాడుకోలేదు. ఆయన రెండుసార్లు సీఎంగా ఉన్నారు. ఎప్పుడు కలుసుకున్నా అత్యంత ఆప్యాయంగా మాట్లాడే వాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు పినరయ్ విజయన్.
50 ఏళ్ల పాటు కేరళ రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చారు ఊమెన్ చాందీ అని ప్రశంసించారు. ఆయన అందరి పట్ల ప్రేమను కలిగి ఉన్నారు. అదే గౌరవాన్ని , ఆప్యాయతను పొందారనంటూ పేర్కొన్నారు కేరళ సీఎం. ఊమెన్ చాందీని కోల్పోవడం రాష్ట్రానికే కాదు తనకు అత్యంత నష్టమని వాపోయారు పినయర్ విజయన్.
ఇదిలా ఉండగా ఊమెన్ చాందీ రెండుసార్లు కేరళ రాష్ట్రానికి సీఎంగా పని చేశారు. 11 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రిగా, సీఎంగా, అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. తనదైన ముద్ర వేశారు కేరళ అభివృద్దిలో.
Also Read : Oomen Chandy : కేరళ 10th మాజీ సీఎం ఊమెన్ చాందీ ఇక లేరు