Kerala CM vs Governor : కేర‌ళ‌లో పంచాయ‌తీకి ముగింపేది

గ‌వ‌ర్న‌ర్ ఖాన్ వ‌ర్సెస్ సీఎం విజ‌య‌న్

Kerala CM vs Governor : కేంద్రంలో న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ రెండ‌వసారి కొలువు తీరాక బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో గ‌వ‌ర్న‌ర్ , సీఎంల మ‌ధ్య ఆధిప‌త్య పోరు(Kerala CM vs Governor) కొన‌సాగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ ఇంత‌లా వివాదాలు చోటు చేసుకున్న దాఖ‌లాలు లేవు.

అప్పుడప్పుడు త‌ప్ప‌. మొన్న‌టికి మొన్న మ‌హారాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌లు, వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ త‌ర్వాత జార్ఖండ్ లో గ‌వ‌ర్న‌ర్ సీఎంకు వ్య‌తిరేకంగా తీసుకున్న చ‌ర్య మ‌రింత రాద్దాంతానికి తెర లేపింది. ఏకంగా సీఎం హేమంత్ సోరేన్ ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు.

త‌న బలాన్ని నిరూపించుకున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ చేసిన ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక త‌మిళ‌నాడులో చెప్పాల్సిన ప‌నే లేదు. అక్క‌డ సీఎం స్టాలిన్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ జీఎన్ ర‌వి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఇక ప‌శ్చిమ బెంగాల్ లో కంటిన్యూ అవుతూనే ఉంది.

తాజాగా కేర‌ళ‌లో సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే లాగా ఉంది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు త‌ప్పంటూ ఎత్తి చూపుతున్నారు గ‌వ‌ర్న‌ర్. ఆయ‌న ఏకంగా తొమ్మిది యూనివ‌ర్శిటీల‌కు చెందిన వీసీలు వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆదేశించారు.

ఆపై న‌వంబ‌ర్ 3 లోపు డెడ్ లైన్ విధించారు. ఇదే క్ర‌మంలో వీసీలు కోర్టును ఆశ్ర‌యించారు. ఇంకా కేసు న‌డుస్తోంది. ఇంత‌లోపే ఆర్థిక మంత్రి అన‌వ‌స‌రంగా నోరు పారేసుకున్నారంటూ రాజీనామాకు ఆదేశించారు. దీనిపై సీఎం విజ‌య‌న్ గ‌వ‌ర్న‌ర్ పై భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు.

రాజ్యాంగాన్ని ర‌క్షించాల్సిన గ‌వ‌ర్న‌ర్ ఏకంగా ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : నోట్ల‌పై ల‌క్ష్మి..గ‌ణ‌ప‌తిల‌ను చేర్చితే బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!