Kerala CM vs Governor : కేర‌ళ‌లో సీఎం..గ‌వ‌ర్న‌ర్ పంచాయ‌తీ

ఒక‌రిపై మ‌రొక‌రి పెత్త‌నం అంటూ ఫైర్

Kerala CM vs Governor : కేర‌ళ‌లో సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ మ‌ధ్య(Kerala CM vs Governor) ఆధిప‌త్య పోరు మొద‌లైంది. గ‌త కొంత కాలం నుంచీ గ‌వ‌ర్న‌ర్ సీఎంల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. రాజ్యాంగానికి విరుద్దంగా సీఎం వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఖాన్ ఆరోపించారు. అయితే త‌న ప‌రిధి దాటి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు సీఎం.

తాజాగా 9 మంది వైస్ ఛాన్స్ లర్ల‌ను రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గ‌వ‌ర్న‌ర్. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు. వీసీల‌ను తొల‌గించే అధికారం గ‌వ‌ర్న‌ర్ కు లేదంటూ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం సిఫార‌సు చేస్తే గ‌వ‌ర్న‌ర్ ఆమోదించాలే త‌ప్పా తొల‌గించే ఛాన్స్ ఆయ‌న‌కు లేదంటూ పేర్కొన్నారు సీఎం విజ‌య‌న్.

దీనిపై మండిప‌డ్డారు ఖాన్. వెంట‌నే తొల‌గించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనిని స‌వాల్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై కేర‌ళ హైకోర్టు సోమ‌వారం సాయంత్రం ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నుంది. సుప్రీంకోర్టు ఉత్త‌ర్వును ఉటంకిస్తూ గ‌వ‌ర్న‌ర్ జారీ చేసిన ఆదేశాల‌ను నిర‌సిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని ఎల్డీఎఫ్ హెచ్చ‌రించింది.

దీంతో వైస్ ఛాన్స్ ల‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇదిలా ఉండ‌గా సీఎం, గ‌వ‌ర్న‌ర్ల మధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ మీడియాతో మాట్లాడారు. వీసీలు రాజీనామా చేయొద్ద‌ని కోరారు. వీసీల‌ను రాజీనామా చేసే అధికారం గ‌వ‌ర్న‌ర్ కు లేద‌ని విజ‌య‌న్ అన్నారు.

ఇదిలా ఉండ‌గా కేర‌ళ యూనివ‌ర్శిటీ, మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్శిటీ, యూనివ‌ర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, క‌న్నూర్ యూనివ‌ర్శిటీ, ఏపీజే అబ్దుల్ క‌లాం టెక్నిక‌ల్ యూనివ‌ర్శిటీ , శ్రీ శంక‌రాచార్య యూనివ‌ర్శిటీ ఆఫ్ సంస్కృతం త‌దిత‌ర తొమ్మిది యూనివ‌ర్శిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : వీసీల రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ డెడ్ లైన్

Leave A Reply

Your Email Id will not be published!