High Court Kerala : ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కేరళ కోర్టు షాక్
ముందస్తు ఫీజులు వసూలు నిలిపి వేత
High Court Kerala : ఈ దేశంలో ప్రతిదీ వ్యాపారంగా మారింది. పీల్చే గాలి నుంచి చనిపోయేంత దాకా. ఇక విద్య ఫక్తు కమర్షియల్ బిజినెస్ గా మారింది. జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయి దేశంలోని మెడికల్ కాలేజీలు.
ఇక యాజమాన్య , ఎన్ఆర్ఐ కోటా కింద ఒక్కో సీటుకు ఒక్కో బేరం. దీనిని గమనించిన కేరళ హైకోర్టు మెడికల్ కాలేజీలకు(High Court Kerala )కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.
ముందస్తు సీట్లకు సంబంధించి ఫీజులు వసూలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాదికి సంబంధించి ముందస్తుగా ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్దమంటూ హెచచరించింది.
గత సంవత్సరం చదువులు పూర్తి చేయనప్పుడు విద్యార్థుల నుంచి వార్షిక ఫీజులు ముందుగానే ఎలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించింది.
బోదిస్తున్న విద్యా సంవత్సరం కాకుండా ఏదైనా విద్యా సంవత్సరం అయితే తప్ప వసూలు చేయాలని తెలిపింది. జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్, మహ్మద్ నియాస్ పీసీలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
కాన్సెప్ట్ గా ఫీజులు అందించిన సేవలకు ప్రతిఫలం అని భవిష్యత్ కాలానికి దానిని వసూలు చేస్తే అది ఇంకా అందించాల్సిన సేవలకు చెల్లింపుగా ఉంటుందని పేర్కొంది.
విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించు కోకుండా నిర్ణయించిన ఫీజులు కట్టాలంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టింది ధర్మాసనం.
ఇది పూర్తిగా వ్యాపారం తప్ప విద్యను అందించడం కాదని పేర్కొంది. వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2019-20 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సులో చేరిన వైద్య విద్యార్థులు తమ కోర్సు మూడో ఏడాదికి సంబంధించి ఫీజులు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు
. దీనిపై విచారించిన కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.
Also Read : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర